*జగిత్యాల జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలి- జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి*
---------------------------------------
నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
జగిత్యాల లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మాతా శిశు సంరక్షణ అధికారి డిప్యూటీ డిఎమ్ అండిచో డాక్టర్ జైపాల్ రెడ్డి. జిల్లాలోని గైనకాలజిస్ట్ లకు ప్రసూతి సేవలపై సిజెరియన్ సెక్షన్ ఆడిట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ*
జగిత్యాల జిల్లాలో సిజేరియన్ సెక్షన్లు ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయని, రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందని, వీటిని తగ్గించి సాధారణ ప్రసవాలు పెంచాలని సూచించారు. గర్భవతిగా నమోదైనప్పటినుంచి ఆశ కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ఎర్లీ రిజిస్ట్రేషన్ క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్ చేత పరీక్షలు చేయిస్తూ సాధారణ ప్రసవానికై వ్యాయామాలు చేపించవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ అరుణ, డాక్టర్ హరిత, డాక్టర్ నాగరాణి డాక్టర్ స్రవంతి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Telangana
*జగిత్యాల జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలి- జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి* --------------------------------------
Quick Summary:
రెడ్డి. జిల్లాలోని గైనకాలజిస్ట్ లకు