నేటి సాక్షి ఆగస్టు 12 పాములపాడు:-
రాష్ట్రంలోని, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త & సమాజ సేవకుడు కంకటి.రవీందర్, ఏపీ-తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కడెం.రవిరాజు లు మండల కేంద్రమైన పాములపాడులో దాతల సహకారంతో త్వరలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తున్న ఎస్.షర్పద్దీన్ అలి, భావన వినోద్ కుమార్, జి.గోవిందు, కలబండిమోసే, ఎం.వెంకట రమేష్, తదితర మీడియా ప్రతినిధులకు శాలువాలు కప్పి, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త & నిత్య సమాజ సేవకుడు కే.రవీందర్, సీఈవో & ఎడిటర్ కె.రవిరాజు లు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం రాక ముందు నుండి నేటి వరకు పాత్రికేయులు మారుమూల ప్రాంతం మొదలుకొని దేశ, విదేశాల వరకు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎంతో కష్టపడి వార్తలను సేకరించి పత్రికలకు పంపడం జరుగుతుందన్నారు. స్వాతంత్ర సమరయోధులందరూ కూడా పత్రికా విలేకరులే అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో వార్తాపత్రికలు కూడా ప్రధాన భూమికను నిర్వహించాయన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజాన్ని నిత్యం చైతన్య పరుస్తూ వార్తల రూపంలో పత్రికల ద్వారానే ప్రజలు ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుందన్నారు. నిత్యం కలం పట్టిన శ్రామికులైన జర్నలిస్టులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వార్తలు సేకరిస్తూ, నిర్భయంగా వార్తలు రాస్తున్న విలేకరులందరి కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. కాబట్టి మీడియా ప్రతినిధులు ఎటువంటి జీతం లేకుండా స్వచ్ఛందంగా పనిచేయడం అనేది చాలా గొప్ప సమాజసేవ అన్నారు. విలేకరులందరికీ ప్రతి ఒక్కరు తమ సహాయ సహకారాలు అందించి, వారి అభివృద్ధికి తోడ్పాటున అందించాలని, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కూడా సహకరించడానికి దాతలు ముందుకు రావాలన్నారు. ప్రజల సమస్యలను నిర్భయంగా చెప్పడానికి వివరంగా చర్చించడానికి ఒక వేదిక ప్రారంభించాలని, అదే వేదిక ప్రెస్ క్లబ్ గా మారాలని పిలుపునిచ్చారు. త్వరలో పాములపాడులో ప్రెస్ క్లబ్ ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
Andhra
*త్వరలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్ పాములపాడులో ఏర్పాటు చేస్తున్న మీడియా ప్రతినిధులకు ఘనంగా సన్మానం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కే.రవీందర్*
Quick Summary:
రాష్ట్రంలోని, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త & సమాజ సేవకుడు కంకటి
