*కుత్బుల్లాపూర్ ఆగస్టు 17 ( ప్రజా శంఖారావం )*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రాంతంలో అనుమతులు లేకుండా బోర్లు వేసి భూగర్భ జలాలను వాణిజ్యపరంగా తరలించి విక్రయిస్తున్న వ్యవహారంపై సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసారు.
ప్రజలు ఇప్పటికే తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో భూగర్భ జలాలను అక్రమంగా తరలించి విక్రయించడం వల్ల భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
అక్రమ బోర్లను గుర్తించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నీటి వ్యాపారాలపై తక్షణమే విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇలాంటి ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. దూలపల్లి ప్రాంతంలో భూగర్భ జలాల అక్రమ తరలింపుపై ఇప్పటికే మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ సమస్యకు సరైన పరిష్కారం లభించలేదని,
ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి కోసం ఎంతదూరమైనా వెళ్లి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలను ఏకం చేసి ప్రజా ఉద్యమం చేపడతాం” అని ఎత్తరి మారయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎండమూరి రాజు , లహవీర్ యాదవ్ మరియు దూలపల్లి స్థానిక కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.
Telangana
*దూలపల్లిలో అక్రమ బోర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలి* *- టిఆర్ఎస్ నాయకులు ఎత్తరి మారయ్య*
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రాంతంలో అనుమతులు