నేటి సాక్షి ఆగస్టు 04 కొత్తపల్లి:-
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ వేతన సవరణ సంఘం పిఆర్సి కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి ఐ ఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేసి అన్ని ఆర్థిక బకాయిలను చెల్లించాలని పిఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
నేడు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో మండల అధ్యక్షుడు సయ్యద్ కలీముల్లా, మండల ప్రధాన కార్యదర్శి సి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నారు. 12వ పి ఆర్ సికమిషన్ గడువు ముగిసి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త పి ఆర్ సి కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఐ ఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా విద్యా హక్కు చట్టం (RTE Act) సెక్షన్ 21(2)లో అవసరమైన సవరణలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
అదేవిధంగా, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ నగదు, సిపిఎస్ ఉద్యోగుల డిఎ అరియర్స్‌ను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ–ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు కె. హుస్సేన్ సాహెబ్, జిల్లా నాయకులు రఫీక్, రామసుబ్బయ్య, ఇద్రుస్, శివయ్య, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.
Andhra
ఉద్యోగ ఉపాధ్యయులకు పెన్షనర్లకు పిఆర్సి కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి ఐ ఆర్ ప్రకటించి, పెండింగ్ డి ఏ లు – ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి: పి ఆర్ టి యు
Quick Summary:
ఐ ఆర్ ప్రకటించి, పెండింగ్ డి ఏ లు – ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి: పి ఆర్ టి యు
