నేటి సాక్షి,సూర్యాపేట
సంయుక్త కిసాన్ మోర్చా (SKM) దేశవ్యాప్త పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమానికి PDSU జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైతాంగ, కార్మికుల పోరాటానికి సంఘీభావంగా PDSU నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జిల్లా ఉపాధ్యక్షుడు రాఖితో పాటు పలువురు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేసి సూర్యాపేట టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
*అరెస్టులు అణచివేత చర్యలే*
ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు, కార్మికులు తమ సమస్యలపై ఆందోళన చేస్తుంటే అరెస్టులతో అడ్డుకోవడం సరికాదని PDSU నాయకులు అన్నారు. అణచివేతలు, అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు.
*రైతు–కార్మిక పోరాటాలకు అండగా*
రైతాంగం, కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలకు PDSU పూర్తి మద్దతుగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
Telangana
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు! SKM జైల్‌భరోకు PDSU సంఘీభావం.. PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి సహా పలువురు నాయకుల అరెస్టు..
Quick Summary:
PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి సహా పలువురు నాయకుల అరెస్టు..