నేటిసాక్షి, మిర్యాలగూడ :
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ‘బడిబాట’ విద్యా వ్యవస్థలో ఒక గొప్ప కార్యక్రమమని మిర్యాలగూడ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) బత్తుల లక్ష్మారెడ్డి మరియు శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) కేతావత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. శనివారం మిర్యాలగూడలో మిర్యాలగూడ మండల విద్యాధికారి ధీరావత్ ధర్మానాయక్ తో కలిసి వారు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించిన ‘బడిబాట’ ప్రచార కరపత్రాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ఉమ్మడిగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థినీ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. పేద, గిరిజన వర్గాల పిల్లలకు ప్రభుత్వ విద్య ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మానాయక్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణకాంత్ నాయక్, ఉపేందర్, తావూర్య, జానయ్య, లక్ష్మణ్, బాషా, వెంకటేశ్వర్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Telangana
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి -ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలను అందిస్తుంది -‘బడిబాట’ కరపత్రం ఆవిష్కరణ చేసిన : ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్
Quick Summary:
పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించండి...
