*నేటిసాక్షి నల్లబెల్లి*
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ నల్లబెల్లి మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి విమర్శించారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాస్తారోకో సుమారు మూడు గంటలపాటు కొనసాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాస్తారోకో విరమించాలని ఎస్సై సాయి ప్రసన్నకుమార్ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ ముప్పు కృష్ణ అక్కడికి చేరుకుని బీఆర్‌ఎస్ నాయకుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు రాస్తారోకో విరమించారు.
ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సాకుగా చూపి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి అంశంపై హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి, మంత్రుల కేసుల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీగా చెల్లిస్తున్న ప్రభుత్వం.. పేద ఆడబిడ్డలకు సంబంధించిన పథకాన్ని కాపాడేందుకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు.
*తులం బంగారం హామీ ఏమైంది?*
కేసీఆర్ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2 తేది న ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయం అందించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని అమలు చేయాల్సి వస్తుందనే భయంతోనే పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో పాక్స్ మాజీ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ , మాజీ ఎంపీపీ లు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ , ఊడుగుల సునీత , మాజీ జడ్పీటీసీ బానోతు హరినాథ్ సింగ్ ,పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త పల్లి కోటి లింగ చారి ,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ , మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీను వాస్ గుప్తా , సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు పులి రమేష్, ప్రధాన కార్యదర్శి జాటోతు రవి చిన్న, గౌరవ అధ్యక్షులు మచ్చిక రవి,బీఆరెస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు గోనె శ్రీదేవి అన్ని గ్రామాల సర్పంచులు, అధ్యక్ష కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతి నిధులు, మండల, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి* *రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది* *బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బానోత్ సారంగపాణి*
Quick Summary:
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం