*నేటి సాక్షి - కరీంనగర్ రూరల్*
పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ వివాహితను బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేసి లైంగికంగా వేధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ ఎ.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని బొమ్మకల్ గ్రామం మధురానగర్‌కు చెందిన ఓ వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోందని, గత ఆరు నెలలుగా సీతారాంపూర్‌కు చెందిన బైక్ మెకానిక్ మెడిదొడ్డి సాయికుమార్‌తో ఆమె కుటుంబానికి పరిచయం ఏర్పడిందని వివరించారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్ ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడటం, మెసేజ్‌లు చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అనంతరం భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి తనతో మాట్లాడాలని, లేకపోతే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొందని సీఐ తెలిపారు. అంతేకాకుండా ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు బలవంతంగా శారీరకంగా వేధించినట్లు ఫిర్యాదులో వెల్లడించిందన్నారు.
*భర్తకు తెలిస్తే ఇబ్బందులంటూ బెదిరింపులు*
ఈ విషయం తన భర్తకు తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని బెదిరిస్తూ బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొందని సీఐ నిరంజన్‌రెడ్డి వివరించారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె భర్త ఇంట్లో సీసీ కెమెరాను ఏర్పాటు చేయగా.. సాయికుమార్ ఆమెను కలిసిన దృశ్యాలు రికార్డయ్యాయని తెలిపారు. ఆ దృశ్యాల అనంతరం కుటుంబంలో వివాదం ఏర్పడిందని, భర్త తన కుమారుడిని తన వద్ద ఉంచుకుని, కుమార్తెను భార్య వద్దకు పంపినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమెకు న్యాయవాది ద్వారా కోర్టు నుంచి విడాకుల నోటీసు పంపినట్లు తెలిసిందన్నారు.
*'ఎక్కడైనా చెప్పుకో' అంటూ బెదిరింపు*
ఈ వ్యవహారంపై సాయికుమార్‌ను ప్రశ్నించగా.. తనకు అవసరమైనప్పుడు ఆమెను ఉపయోగించుకున్నానని, ఇకపై తన వద్దకు రావద్దని, ఎక్కడైనా చెప్పుకోవచ్చంటూ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని సీఐ తెలిపారు. దీంతో బాధితురాలు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. దర్యాప్తులో భాగంగా బాధితురాలి భర్తతోపాటు సాక్షులను విచారించామని, ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైన వీడియోను సేకరించి పరిశీలించామని పేర్కొన్నారు.
*మెకానిక్ షాపు వద్ద నిందితుడి అరెస్ట్*
కేసు నమోదు అనంతరం నిందితుడు సాయికుమార్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఈ క్రమంలో గణేశ్‌నగర్‌లోని తన బైక్ మెకానిక్ షాపు వద్ద సాయికుమార్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అనంతరం అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
*బాధితురాలికి భరోసా సెంటర్‌లో సహాయం*
దర్యాప్తులో భాగంగా బాధితురాలిని కరీంనగర్‌లోని భరోసా సెంటర్‌కు పంపించి అవసరమైన సహాయం అందించామని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. కేసులో సేకరించిన సీసీ కెమెరా దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు తదితర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు.
---------
Telangana
*పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్‌మెయిల్.. పలుమార్లు వేధింపులు.!* ---------- * వివాహితను బెదిరించి లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్ * సీసీ కెమెరా దృశ్యాలతో దర్యాప్తు.. మెకానిక్ షాపు వద్ద నిందితుడి పట్టివేత --------
Quick Summary:
దర్యాప్తులో భాగంగా బాధితురాలిని