నేటి సాక్షి ఆగస్టు 12 పాములపాడు :-
ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ " శక్తి యాప్ అవేర్నెస్ టీం " సిబ్బంది రాజశ్రీ నంద్యాల జిల్లా ఎస్పీశ్రీ సునీల్ షోరాణ్ దొర వారి ఆదేశాల మేరకు, రాజశ్రీ ఆత్మకూరు డి.ఎస్.పి శ్రీ ఆర్ రామాంజి నాయక్ సారు వారి ఉత్తర్వుల మేరకు మరియు ఆత్మకూరు రూరల్ సీఐ యం సురేష్ కుమార్ రెడ్డి సార్ గారి పర్యవేక్షణ లో పాములపాడు ఎస్సై . పి.తిరుపాల్ సార్ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు " శక్తీ టీం " సిబ్బంది పాములపాడు ఏఎస్ఐ షేక్ నూర్ అహమ్మద్, ఆత్మకూరు వుమెన్ హోంగార్డు సుప్రియ లము పాములపాడు లోని శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియంహై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ ఆర్ ఎస్ ఆర్ గోపాల్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 300 మంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు " శక్తీ యాప్ అవేర్నెస్ " ప్రోగ్రాము లో భాగంగా మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన " శక్తి యాప్ " గురించి మరియు శక్తి యాప్ వాట్సాప్ నంబర్ 7993485111 గురించి తెలుపుతూ, మహిళల రక్షణకై ఏర్పాటు చేసిన పోక్సో చట్టం గురించి, బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరగకుండా ఆపుటకు 1098 ఫిర్యాదు చేయవలెనని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని అట్లా ఎవరయినా చేస్తునట్లయితే 112 కు గానీ, 1098 కి ఫోన్ చేసి చెప్పాలని తెలుపుతూ..ఉమన్ వెల్ఫేర్ 181, ఎమర్జెన్సీ కాల్ 112, 100 కి ఫోన్ చేయవలెనని, సైబర్ క్రైమ్ జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయవలెనని, ఫేక్ కాల్స్,apk ఫైల్స్ లాంటివి ఏదన్నా మీ పేరెంట్స్ సెల్ ఫోన్ వాట్సప్ లకు ఎవరైనా లింక్ మెసేజ్లు పంపితే వాటిని ఓపెన్ చేయొద్దు అని తెలుపుతూ వాటి ద్వారా వారికీ జరిగే ఆర్థిక నష్టాలను గురించి కూడా తెలిపి,వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం అయినది, సార్. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లలలో శక్తీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని అత్యవసర సమయాలలో శక్తీ యాప్ ను ఎలా వాడాలి, దానీ ఉపయోగాల గురించి తెలుపడమే కాకుండా మీరు మంచి క్రమశిక్షణ తో మెలుగుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ ఆడపిల్లలను " ఈవిటీజింగ్ " పేరుతో ఎవరైనా ఆకతాయిలు అల్లరి పట్టించడం లాంటివి చేస్తే ఏ మాత్రం అధైర్య పడకుండా, మీకు భరోసాను మరియు ధైర్యాన్ని ఇచ్చే మీకు రక్షణ ఉండేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తీ యాప్ ను ఉపయోగించి 112 కు గానీ 1098 కి గానీ ఫోన్ చేసి సహాయం పొందవచ్చు అని అవేర్నెస్ చేసినాము. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మైనర్ విద్యార్థులు ఎవరు కూడా మోటార్ సైకిల్ ను నడపకూడదని తెలియపరిచినాము. చదువు మీద ధ్యాస పెట్టి బాగా కష్టపడి చదివి మీ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని. చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గౌరవాన్ని, మర్యాదను, హుందాతనాన్ని తీసుకొచ్చి మీ తలరాతలను మార్చేది చదువు ఒక్కటే అని తెలుపుతూ.. అదేవిధంగా మీ ఇంట్లోని మీ పేరెంట్స్ మోటార్ సైకిళ్లను నడిపేటప్పుడు ఖచ్చితంగా తలకు రక్షణగా " హెల్మెట్ " పెట్టుకొని ప్రయాణం చేయాలని హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి మరియు ఎవ్వరూ కూడా మీ ఇంట్లోని వారు నాన్న,అన్నా,బాబాయి,మేనమామ లు ఎవ్వరైనా సరే మధ్యం త్రాగి వాహనాలను నడపవద్దని చెప్పమని సూచిస్తూ...త్రాగి వాహనం నడిపి పోలీస్ సార్వాళ్ళకు చిక్కి కేసు పెట్టి కోర్టు కు పంపిస్తే కోర్టు జడ్జి వారు 10 వేల రూపాయలు ఫైన్ లేదా జైలు శిక్ష ను విధిస్తారు అని తెలుపుతూ అవేర్నెస్ ప్రోగ్రాం చేసినాము,సార్.
నమస్తే సార్.నమస్తే సార్,
Andhra
పాములపాడు శ్రీ వివేకానంద స్కూల్లో శక్తి యాప్ గురించి అవగాహన కల్పిస్తున్న ఏఎస్ఐ షేక్ నూర్ అహమ్మద్, ఎస్ఐ , పి. తిరుపాలు
Quick Summary:
ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ " శక్తి యాప్

