నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని నారాయణపురం గ్రామ పంచాయితీలో పలు అక్రమాల జరుగుతున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని మాజీ సర్పంచ్ తమ్మనబోయిన శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయితీలో గ్రామ కార్యదర్శితో పాటు పలువురు అక్రమంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను సర్పంచ్ ఉన్న సమయంలో పనులు చేసిన డబ్బులు కూడ తనకు ఇవ్వలేదని, అ డబ్బులను కూడ అక్రమంగా వారే డ్రా చేసుకున్నారని అరోపిస్తున్నారు. అక్రమాల విషయంలో పై అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు నారాయణపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో సంబందింత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Telangana
**గ్రామ పంచాయితీలో పలు అక్రమాలపై ఆరోపణలు**
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని
