*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత నేత "కెఎం. పాండు" 81వ జయంతి కార్యక్రమం సోమవారం 132- జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ హాజరై వారి తండ్రి కేఎం.పాండు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ....దివంగత నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ కెఎం.పాండు ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కె.ఎం. పాండు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నరసింహారెడ్డి, బలవంత్ రెడ్డి, పెద్ది మల్లేశం నల్ల లింగం ఆర్. మురళీ గౌడ్, జీ. నరహరి, రామన్, ఎన్. నగేష్, లక్ష్మణా చారి, కుత్బుల్లాపూర్ గ్రామస్తులు కృష్ణ గౌడ్, సుధాకర్ గౌడ్, నార్ల కంటి శంకర్, నార్ల కంటి శ్యామ్, కుంట వేణు, ఆటో బలరాం, నార్ల కంటి కుమార్, కావడి గోపాల్ రెడ్డి, నారాయణ, మధు రెడ్డి, ఇంద్రారెడ్డి, హేమలత, లావణ్య, డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*మున్సిపల్ మాజీ చైర్మన్ కెఎం.పాండు 81వ జయంతి సందర్బంగా ఘన నివాళ్లు*
Quick Summary:
కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత