నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు సీడీపీఓ పి. వేణుగోపాలరావు ఆదేశాల మేరకు, ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా, మంగళవారం పట్టణంలోని గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని పాపపూసల దిబ్బ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు, తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు. శిశువు జన్మించిన గంటలోపు వచ్చే ముర్రిపాలలో ఉండే కొలెస్ట్రాల్ శిశువుకు తొలి టీకా మాదిరిగా రోగనిరోధక శక్తిని అందిస్తుందని, కాబట్టి ఆ పాలను తప్పనిసరిగా శిశువుకు పట్టించాలని సూచించారు. అలాగే పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు శిశువుకు ఎలాంటి ఇతర ఆహారం లేదా ద్రవాలు ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని వివరించారు. అనంతరం
కార్యక్రమంలో భాగంగా సామూహిక అన్నప్రాసన వేడుకలను కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నజీమా బేగం మహమ్మద్, బ్లాక్ కో-ఆర్డినేటర్ టి.కవిత, అంగన్వాడీ టీచర్లు అరుణ, ఉమా, ధనలక్ష్మి, అంగన్వాడీ హెల్పర్ లక్ష్మీకాంతమ్మ, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు... -తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన... -సామూహిక అన్నప్రాసన వేడుకలు నిర్వహణ
Quick Summary:
సామూహిక అన్నప్రాసన వేడుకలు నిర్వహణ