నేటి సాక్షి ఆగస్టు 06
పెద్దకడబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన వడ్డే పూజిత (14) అదృశ్యమైన ఘటనపై పెద్దకడబూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి వడ్డే ఉసేనమ్మ ఫిర్యాదు మేరకు, పూజిత ఇంటి నుంచి బహిర్భూమికి వెళ్తానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు.
కుటుంబ సభ్యులు గ్రామంలో, బంధువుల వద్ద విస్తృతంగా గాలించి, ఫోన్ ద్వారా ఆరా తీసినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన పూజిత సుమారు నాలుగు అడుగుల ఎత్తు, చామనచాయ రంగుతో ఉండి, ఇంటి నుంచి వెళ్లే సమయంలో నల్లటి పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పెద్దకడబూరు ఎస్‌ఐ మారుతి తెలిపారు.
Andhra
బాలిక అదృశ్యం.. కేసు నమోదు
Quick Summary:
పెద్దకడబూరు మండలం చిన్న