నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
చదువుకు దూరమైన విద్యార్థులకు తిరిగి చదువుకునే అవకాశం కల్పించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ చేపట్టిన ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోడ-కరపత్రికను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ బుధవారం ఆవిష్కరించారు.
జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాములు, టీ ఓ ఎస్ ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ పాల్గొని కరపత్రాలను విడుదల చేశారు.
*ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ*
పాఠశాల స్థాయిలోనే వివిధ కారణాలతో చదువు ఆపేసిన యువతీ యువకులు టీ ఓ ఎస్ ఎస్ ద్వారా అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. "చదవాలనే కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశంతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
*జిల్లా విద్యాధికారి రాములు మాట్లాడుతూ*
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తమ గ్రామాల్లో చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులను గుర్తించి టీ ఓ ఎస్ ఎస్ లో చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
టీఓ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి గ్రామంలోని యువకులను కనీసం ఇంటర్ వరకు చదివించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బుగ్గారం శ్రీ గ్లోబల్ స్కూల్ అధినేత డాక్టర్ నక్కరాజు, సిరిపురం రాజేందర్, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*తెలంగాణ ఓపెన్ స్కూల్ గోడ-కరపత్రిక ఆవిష్కరణ* *చదువు ఆపేసిన వారికి TOSS సువర్ణ అవకాశం* *జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్* ----------------------------------------
Quick Summary:
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్*