నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్ 23
చౌడేపల్లి తిరుపతి ప్రధాన రహదారిపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో రోడ్డు ఆక్రమణలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతం నిత్యం వాహనాలు, జనసంచారంతో రద్దీగా ఉంటుంది. అయితే రహదారిపై ఆక్రమణలు పెరగడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది.రద్దీ సమయాల్లో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు వాహనాలు బస్టాండ్‌లోకి వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రయాణ సమయం పెరుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డుపై సరైన నిర్వహణ లేకపోవడం, అక్రమ పార్కింగ్‌లు, ఇరుకైన మార్గం, రహదారిపై వ్యాపార కార్యకలాపాలు వంటి కారణాలు ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణాలుగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Andhra
ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డు ఆక్రమణలు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Quick Summary:
ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డు ఆక్రమణలు..
