*నేటి సాక్షి 13 జూపాడుబంగ్లా తంగేడంచ* :-
జూపాడు బంగ్లా మండల ఆరోగ్య కేంద్రం పి హెచ్ సి డాక్టర్ . గంగాధర్ ఆధ్వర్యంలో తంగేడంచ గ్రామంలో నిర్వహించిన 104 సంచార చికిత్స సేవలను ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమం లో జూపాడుబంగ్లా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి ప్రజలకు అవగాహన కల్పిస్తూ....
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామీణ పల్లె ప్రజలకు ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు 104 సంచార వైద్య వాహనాలను భారీ స్థాయిలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లోh మంచానికే పరిమితమైన వృద్ధులు దివ్యాంగులతో పాటు అనారోగ్య బాధితులకు 104 వాహనాల సంచార వైద్య సేవలు వరంగా మారాయి.అవస్థలు పడుతూ ఎటు వెళ్లాల్సిన అవసరం లేకుండా వీటి ద్వారా సొంత ఊరిలోనే మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. రక్తపోటు , మధుమేహం ఈసీజీ లాంటి పరీక్షలు పక్షపాతం లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి గర్భిణులకు 104సేవలు ఎంతో మేలు చేకూరుతుంది. గర్భిణులకు ఉచితంగా పరీక్షలు బీపీ, హిమోగ్లోబిన్ లాంటి పరీక్షలు చేస్తారు. కాల్షియం ఐరన్ మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తారు కాబట్టి దీనిని మన గ్రామీణ ప్రాంతాల ప్రజలు అందుబాటులో అందరూ సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి తెలపడమైనది.
*104 సంచార చికిత్స వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి* *నంద్యాల జిల్లా 104 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గూడెం.రవికుమార్* *ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొన్ని ముఖ్య విషయాలు*....
ఈ 104 సేవలను ప్రభుత్వం అన్ని రకాల సేవలను ప్రజలు అందుబాటులో తీసుకొచ్చింది. సంజీవని తో మీ ఇంటి వద్దకే అత్యాధునిక వైద్యం అందుతుంది అన్నారు. మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నవారే నిజమైన ధనవంతులనీ వేల కోట్లు ఉన్న , ప్యాలెస్ లు ఉన్న కానీ మనిషి ఆరోగ్యంగా లేకపోతే వ్యర్థమని ఆరోగ్యవంతులైన సంపన్న దేశాన్ని గ్రామీణ ప్రాంత ల, ప్రజలకు వైద్య సేవలను పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు సంజీవని
104 వాహనాలు గ్రామాల్లో ప్రజలకు ఉదయం 9నుండి సాయంత్రం 4గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు.
104 వైద్యుడు తో పాటు సంబంధిత పి హెచ్ సి వైద్యుడు మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్ అందుబాటులో ఉంటారు. నడవలేని వారు కూడా మంచానికే పరిమితమైన వృద్ధులు దివ్యాంగులు ఇతర రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి డాక్టర్లు సేవలు అందజేస్తారు.
104 డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి రోగి వివరాలు ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో పొందుపరుస్తారు. రోగికి మెరుగైన వైద్య సేవలు అవసరం ఐతే పి హెచ్ సి ,సి హెచ్ సి జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. సంబంధిత రోగిని ఆసుపత్రిని తరలించే బాధ్యత స్థానిక హెల్త్ సెంటర్లు ఏఎన్ఎం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని. కోరడమైనది. గూడెం రవికుమార్ వారు ప్రజలకు అవగాహన కల్పించడమైనది.
ఈ కార్యక్రమం లో తంగేడంచ సచివాలయం హెల్త్ సెక్రటరీ వేల్పుల. శ్వేత. మరియు ఆశాలు రాములమ్మ, శ్యామలమ్మ, మరియు 104సిబ్బంది c. శ్రీకాంత్ డీఈవో, అంబులెన్స్ పైలెట్.. మధుసూదన్ హరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Andhra
*గ్రామీణ ప్రాంత పల్లె ప్రజలకు అందుబాటులో 104 అంబులెన్స్ వైద్య సేవలు* :- హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి , ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ గూడెం రవికుమార్.
Quick Summary:
పల్లె ప్రజలకు అందుబాటులో 104....