నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.........................................
పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత రవాణా లక్ష్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు పాఠశాలల యజమానులు, కరస్పాండెంట్లు, డ్రైవర్లకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
*ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని మాట్లాడుతూ*
విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అన్నారు. పాఠశాల వాహనాల్లో డ్రైవర్‌తో పాటు అటెండర్, ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలని, సీట్ల సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించరాదని సూచించారు.
పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలని, వాహనాల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రామారావు, సాయికిరణ్, రియాజ్, ప్రైవేట్ పాఠశాలల జిల్లా బాధ్యులు రవిప్రసాద్, గంగారెడ్డి, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.
Telangana
*ప్రైవేటు పాఠశాల యజమానులు, డ్రైవర్లకు అవగాహన సదస్సు* *విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని* ------------------------------------------
Quick Summary:
*ప్రైవేటు పాఠశాల యజమానులు, డ్రైవర్లకు అవగాహన సదస్సు*