నేటి సాక్షి ఆగస్టు 05
కోసిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 45 రోజుల "ఇంటింటికి సంక్షేమంతో – ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా 10వ రోజు కోసిగి టౌన్‌లోని 7, 9 వార్డుల్లో బుధవారం విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, పరిశీలకుడు కె. హరి, యువనాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శక పాలన గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు జ్ఞానేష్, సొసైటీ చైర్మన్ నాడినేని అయ్యన్న, మాజీ జెడ్పీటీసీలు తోవి రామకృష్ణ, జక్కనగేని వెంకటేష్, సాతనూరు కోసిగయ్య, హొళగుందా కోసిగయ్య, అరివిలి వీరేష్, నాడినేని మహాదేవ, జంపాపురం కృష్ణారెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి రంగారెడ్డి, సంజీవిగేని ఈరన్న, మైనారిటీ నాయకులు కలందర్, గౌస్, పోతుల వీరారెడ్డి, సొట్టయ్య, కొండగేని నర్సిరెడ్డితో పాటు టౌన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
Telangana
కోసిగి టౌన్‌లో జోరుగా 'ఇంటింటికి సంక్షేమంతో – ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం _ ప్రజా సంక్షేమ పథకాలను వివరించిన టీడీపీ నాయకులు
Quick Summary:
కోసిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు