నేటి సాక్షి ఆగస్టు 24 పాములపాడు:-
నందికొట్కూరు నియోజకవర్గం,
పాములపాడు మండలంలోని, ఇస్కాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 20 క్యూసెక్కుల 2000 ఎకరాలకు సాగునీటిని తాగునీటిని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య బటన్ ఆన్ చేసి విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు విడుదల చేయడంతో ఇస్కాల గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి శాలువాలు కప్పి, పూల బొకేలు చేతికి అందించి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, నందికొట్కూరు నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పగిడ్యాల మండల కన్వీనర్ పలచాని మహేశ్వర్ రెడ్డి, అబ్జర్వర్ వెంకటశివుడు, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల జనార్దన్ రెడ్డి, కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు ఏఎస్ఐ- జోసెఫ్, భానుముక్కల బల్లమూరి వెంకటేశ్వరరావు, జూటూరు నాయిని మధు, టిడిపి కల్చర్ మండల అధ్యక్షుడు భావన వినోద్ కుమార్, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, రుద్రవరం రాచపుడి.సురేష్, లింగాల మాజీ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, ఇస్కాల లింగస్వామి, ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, చెలిమిల్ల ఆదినారాయణ, జలవనరుల శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.
Andhra
*ఇస్కాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటినీ విడుదల చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య*
Quick Summary:
నందికొట్కూరు నియోజకవర్గం
