నేటి సాక్షి ఆగస్టు 17 పాములపాడు :-
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన ఆకుల నాగేంద్ర (50)పార్థివ దేహానికి మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబానికి మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, ముద్దపాటి ప్రసాద్, దార ప్రసన్న, బోనపల్లె సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Andhra
*మృతి చెందిన ఆకుల.నాగేంద్ర కుటుంబానికి 5వేలు ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ*
Quick Summary:
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో