నేటి సాక్షి గజ్వేల్.....
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ దరఖాస్తును ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఇందిరాపార్కు చౌరస్తా వద్ద బీజేపీ, ఎన్నికల సంఘం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ, రాజ్యసభ నామినేషన్ దరఖాస్తు తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తోందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ దరఖాస్తు తిరస్కరణపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు వంటేరు నరేందర్ రెడ్డి, విజయమోహన్, విరూపాక శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ తోపాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Telangana
రాజ్యసభ దరఖాస్తు తిరస్కరణ ప్రజాస్వామ్యానికి మచ్చ: ఆంక్ష రెడ్డి గజ్వేల్‌లో ఈసీ, బీజేపీ దిష్టిబొమ్మల దహనం.. కాంగ్రెస్ ఆందోళన
Quick Summary:
రాజ్యసభ దరఖాస్తు తిరస్కరణ...

