నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని మేరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ గ్రంధాలయంలో భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు, మహోన్నత మేధావి ఎస్.ఆర్. రంగనాథన్ 134వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు, కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్.ఆర్. రంగనాథన్ గొప్ప మేధావి అని కొనియాడారు.“జ్ఞానం సముద్రం లాంటిదని, జ్ఞానాన్ని ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి రంగనాథన్” అని పేర్కొన్నారు.
గ్రంథాలయాల్లో పుస్తకాల వర్గీకరణకు ఉపయోగపడే కాలన్ క్లాసిఫికేషన్ (Colon Classification – C.C.) పద్ధతిని, గ్రంథాలయ సేవలకు సంబంధించిన పంచ సూత్రాలను రూపొందించి, ప్రతి పాఠకుడికి అవసరమైన పుస్తకాలు సులభంగా అందుబాటులో ఉండేలా చేసిన మహోన్నత శక్తి ఎస్.ఆర్. రంగనాథన్ అని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠకులు గ్రంథపాలకులు శ్యామ్ సుందర్ ప్రసాద్, కుమ్మరికుంట్ల సుధాకర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
గ్రంథాలయంలో... ఘనంగా ఎస్.ఆర్. రంగనాథన్ 134వ జయంతి వేడుకలు
Quick Summary:
రామచంద్రారెడ్డి ప్రభుత్వ గ్రంధాలయంలో