నేటి సాక్షి ఆగస్టు 24 జూపాడుబంగ్లా :-
నందికొట్కూరు తాలుక జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నికి ముక్య అతిథిగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారు హాజరు కావడం జరిగినది. జూపాడుబంగ్లా ఎంపిడిఓ గోపీకృష్ణ వారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారికి పూల బొక్కే ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ వారు కూడ శాలువాలతో సన్మానం చేసి పూల బొక్కే స్వాగత పలికారు తడంతరం
తరిగోపుల గ్రామంలో 15వ ఫైనాన్స్ ద్వారా 36 లక్షలతో నూతన హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
తరిగోపుల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు – ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా అన్నారు
ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండలం కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు హెల్త్ సిబ్బంది ఆశాలు మరియు టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు మరియు ప్రజలు పాల్గొని విజయవంతం చేయడమైనది..
Andhra
ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం నూతన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య.
Quick Summary:
నందికొట్కూరు తాలుక జూపాడుబంగ్లా