నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు
పడుతున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్, వీరన్న నాయక్ అన్నారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, వెంటనే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టినట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు జగన్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్, గర్ల్స్ కన్వీనర్ ఝాన్సీ, చంటి, వంశీ, తరుణ్, పవన్, దత్తు, అభి, తదితరులు పాల్గొన్నారు.
Telangana
సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు -ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, తహశీల్దార్ కు వినతిపత్రం
Quick Summary:
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, తహశీల్దార్ కు వినతిపత్రం
