నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అండగా నిలిచాయని, అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలకు మోక్షం పలికే విధంగా వ్యవహరిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందకుండా చేస్తున్న తీరును నిరసిస్తూ, సోమవారం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు మరియు వార్డు ఇంచార్జి ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఆర్డీఓ రమణారెడ్డి కి వినతిపత్రం అందజేసి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు.
అనంతరం ఒంటరి మహిళ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే మహిళలకు తహశీల్దార్ కార్యాలయం ద్వారా అవసరమైన ధృవీకరణ పత్రాలను సులభంగా జారీ చేయాలని, అర్హత కలిగిన మహిళలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు దూరం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు.
పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని, నాయకులు స్పష్టం చేశారు. తదుపరి నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కి కూడా గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎం.డి ఇలియాస్ ఖాన్, కౌన్సిలర్లు దీపిక విజయ్, జానకమ్మ దుర్గాప్రసాద్, లావుడి అరుణ సుధాకర్, సందేశ్ రజిని అంజన్ రాజు, మర్రి అంజిబాబు, తిరుమలగిరి వజ్రం, వడ్డేపల్లి శ్రీనివాస్, జన్నపాల సునీత కిరణ్, ఎర్రమల దినేష్ నాయకులు జి.డి.ఆర్ జానీ, వార్డు ఇంచార్జ్ లు భూక్య రాంబాబు, రమావత్ భీమ్లా నాయక్, ఐల వెంకన్న గౌడ్, కందగట్ల అశోక్, పందిరి వేణు, షేక్ మస్తాన్, షేక్ ఖలీల్, గౌటే కనకయ్య, దుర్గయ్య, ఎండి . గయాస్, ఆలీం, కడియం సైదులు, రాజనబోయిన గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
**దామరచర్ల మండల కేంద్రంలో...
ఆ పధకాలను ను రద్దు చేయవద్దు...బీఆర్ఎస్
: పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాని కల్పించేందుకు అమలు అవుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని దామరచర్ల మండల బీఆర్ఎస్ నాయకులు సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, నిరుపేద ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భారం కాకూడదని ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ పథకంలో తులం బంగారం ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా పథకాన్ని రద్దు చేసేలా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ జవహర్ లాల్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డి నారాయణరెడ్డి, యూసుఫ్, హతిరామ్, సత్యనారాయణ, పాచ్చు నాయక్, రఫీ, రమేష్ నాయక్, ప్రకాష్, సురేష్ పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
పేదింటి ఆడబిడ్డలకు అండగా బీఆర్ఎస్ పార్టీ.... -కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలి -పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలి -బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన -ఆర్డీఓ రమణారెడ్డి కి వినతిపత్రం అందజేత
Quick Summary:
పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలి