నేటి సాక్షి, చిలుకూరు:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఈ- పంచాయతీ పోర్టల్ నందు హౌస్ అసెస్మెంట్ నెంబర్:614 బెల్డే నాగయ్య స్థలం పాత రికార్డు పరంగా 98 గజాలు ఉండగా పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండా తమ దర్పాన్ని ఉపయోగించి 753 గజాలుగా ఈ- పంచాయతీలో గత రెండవ శనివారం (11/07/2026) నాడు హడావుడిగా అధికారులకు తెలియకుండానే ఎవరో మార్పులు చేశారు. కాగా సంబంధిత స్థల యజమానికి యాజమాన్య ధ్రువీకరణ పత్రం అవసరం రావడంతో గత నెలలోనే 15/07/2026న గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం మంజూరు చేసే సమయంలో సదరు స్థలానికి సంబంధించి రికార్డును పరిశీలించి, ఆన్లైన్లో తనిఖీ చేసి స్థల కొలతలకు సంబంధించి వివరాలు అడగగా ఆన్లైన్లో ఉన్న దానికి, గ్రామపంచాయతీ రికార్డులకు పొంతన లేకుండా ఉన్నది. దీంతో అవాక్కైనా
పంచాయతీ కార్యదర్శి తన ప్రమేయం లేకుండా స్థలంలో జరిగిన మార్పులపై జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు మండల స్థానిక పోలీస్ స్టేషన్లో పంచాయతీ స్థలానికి సంబంధించిన మార్పులు చేర్పులపై మరోమారు ఈ నెల 7వ తారీఖున ఫిర్యాదు చేశాడు. దీంతో మార్పులు చేసిన వ్యక్తులను ఎస్ఐ స్టేషన్ కు పిలిపించి విచారించాడు. ఆ తర్వాత మార్చిన వ్యక్తులు తేరుకొని 12 వ తారీఖున పాత అసెస్మెంట్ నెంబర్ రికార్డుల నుంచి పూర్తిగా తొలగించి దాని స్థానంలో
కొత్త అసెస్మెంట్ 843 తిరిగి యధావిధిగా స్థలం 98 గజాలుగా మార్పులను చేశారు. ఎవరిని విచారించిన మాకు తెలియదని సమాధానం చెబుతూనే వెంట వెంటనే స్థల మార్పులు ఎలా సాధ్యమని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని స్థలాల విషయంలో కూడా ఇలానే జరుగుతుందా? అసలు ఏమి జరుగుతుందో మండలంలో అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంలో ఎవర్ని సంప్రదించాలో, ఎవరితో పంచుకుంటే ఏమి జరుగుతుందో అర్థం కాకుండా ఉందని పలువురు వాపోతున్నారు.
Telangana
*ఫిర్యాదులో ఉండగానే.... ఆన్లైన్లో తిరిగి మార్పులు* 👉పాత రికార్డులో అసెస్మెంట్ నెంబర్ 614 తొలగింపు.. 👉కొత్తగా 843 అసెస్మెంట్ నెంబరు గా మార్పిడి.. 👉మండల అధికారులు తెలియకుండానే మార్పులు ఎలా సాధ్యం?
Quick Summary:
పాత రికార్డులో అసెస్మెంట్ నెంబర్ 614 తొలగింపు.