నేటి సాక్షి ధర్మపురి *గాదెపెల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం*
*ధర్మపురి: ధర్మపురి మండలం గాదెపెల్లి గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. MGNREGS నిధుల ద్వారా సుమారు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మహిళా సంఘ భవనాన్ని, సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.*
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సూచించారు. గాదెపెల్లి గ్రామానికి అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనబట్ల దినేష్,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
గాదెపెల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం*
Quick Summary:
ధర్మపురి: ధర్మపురి మండలం గాదెపెల్లి గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

