నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం నమ్మదగిన సమాచారం మేరకు కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి నిర్వహించింది.
టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు “నమ్మదగిన సమాచారం మేరకు నారాయణపూర్ గ్రామ శివారులో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై దాడి నిర్వహించాం. ఈ దాడిలో 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.82,770/- నగదు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నాం. పట్టుబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించాం” అని తెలిపారు. జిల్లాలో పేకాట, జూదం ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా హెచ్చరించింది.
పేకాటకు పాల్పడిన వారిపై కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
పేకాట స్థావరంపై సమర్థవంతంగా దాడి నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకుని నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా బృంద సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, అభినందించారు.
Telangana
కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి. 8 మంది అరెస్ట్ రూ.82,770 నగదు, పేక ముక్కలు స్వాధీనం.
Quick Summary:
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
