నేటిసాక్షి, మిర్యాలగూడ :
పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమానాలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ, తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో... పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి గుడిపాటి శిరీష నవీన్, వివిధ రాజకీయ పార్టీల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయంలో... పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి గద్దర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ మరియు గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో
సామాజిక వేత్త డా. రాజు, మరో గ్రంథాలయ ఉద్యమ నేత కస్తూరి ప్రభాకర్, లైబ్రరీయన్ సహాయకులు కుమ్మరి కుంట్ల సుధాకర్, దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్, కందుకూరి సుదర్శన్, లక్ష్మి నారాయణ, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో... పట్టణంలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మరియు ప్రజాకవి గద్దర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ప్రభాకర్, కందుకూరి సుదర్శన్, కళాశాల ప్రిన్సిపల్ కోలా శ్రీనివాస్, అధ్యాపకులు సంతోష్ కుమార్, రాజు, శ్రవణ్, లక్ష్మణ్, కృష్ణయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని జయశంకర్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
విజేత డిగ్రీ కళాశాలలో....
పట్టణంలోని విజేత డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్, గద్దరన్న, జహీర్ అలీ ఖాన్ సాబ్ యాది కార్యక్రమాన్ని గురువారం తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ మాట్లాడుతూ, ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొ. జయశంకర్ సేవను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా, వారి సంకల్పబలం రాష్ట్రసాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ లంచెలుగా ఆశయ ఆలోచనలకు పడునుపెడుతూ, రాష్ట్రసాధనకు ఆయువుపట్టు అయ్యారు.
వందలాది కవులతో, గాయకులతో, కళాకారులతో, వేల, లక్షల మంది శ్రోతలతో కలగలిసిన ఒక మహత్తర విప్లవ సాంస్కృతికోద్యమంలో, గద్దర్ ‘తరగని గని’ నుంచి ‘ప్రజా సంగీతం .
అలాగే హైదరాబాద్ లో లౌకిక వాద సువాసనలు వెదల్లిన వారు సియాసత్ ఎడిటర్,జనాబ్ జహీర్ అలీ ఖాన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మధు, చారి, యాదయ్య, హరి, దుర్గయ్య, జ్యోతి, రాజారాం, వీరయ్య, పాపయ్య, సతీష్, చారి, రమాదేవి శ్రీనివాస్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఘనంగా తెలంగాణ జాతిపిత "ప్రొఫెసర్ జయశంకర్" జయంతి, ప్రజాకవి గద్దర్ వర్ధంతి వేడుకలు.... -ఘన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాలు
Quick Summary:
-ఘన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాలు

