నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్ 16
మండల డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ను కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు .స్థానిక పరిపాలన భవనంలో నాయకులు ఆయనను కలిశారు ప్రతిదినం తెల్లవారుజామున మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ పల్లె జనానికి పారిశుద్ధం పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కాకుండా చెత్త సేకరణ కేంద్రాల వద్దకు వెళ్లి వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువుల తయారీలో అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు .అంతేకాకుండా ఇంటి పన్ను విషయంలో ముందంజలో ఉన్నారు, ఇటీవల పెద్ద ఎల్లకుంట్లలో మంచినీటి సమస్య వస్తే విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ను అమర్చి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో జనసేన నాయకుడు గందోడి చరణ్ కుమార్ రాయల్ .సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్. కార్తీక్ .తదితరులు డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు,
Andhra
సన్మానించిన కూటమి నాయకులు
Quick Summary:
సన్మానించిన కూటమి నాయకులు