నేటి సాక్షి వికారాబాద్ :
జిల్లాలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు, ఆధార్ అనుసంధానం, ఆఫర్ జనరేషన్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల మండల విద్యాశాఖాధికారులతో విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ నమోదు/అనుసంధానం, ఆఫర్ జనరేషన్ FLN ప్రగతిని సమీక్షించారు.
ప్రతి మండల విద్యాశాఖాధికారికి నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ముఖ్యంగా ప్రీ-ప్రైమరీ తరగతుల ఎన్‌రోల్‌మెంట్‌తో పాటు 1వ తరగతి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
విద్యార్థుల నమోదు ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న ఆధార్ మరియు ఆఫర్ జనరేషన్ ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి, సంబంధిత ఆన్‌లైన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని తెలిపారు.
వికారాబాద్ జిల్లాను విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో రాష్ట్రంలో ముందువరుసలో నిలిపే విధంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా, విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని MEOలకు సూచించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించేలా పాఠశాల స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ప్రతి మండల విద్యాధికారి (MEO) ప్రతి నెల తప్పనిసరిగా కనీసం 15 పాఠశాలలను సందర్శించి, పాఠశాలల్లో విద్యా బోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, FLN ప్రగతి మరియు ఇతర అకాడమిక్ అంశాలను సమగ్రంగా పరిశీలించాలని, పాఠశాలలను సందర్శించిన సందర్భంగా అకాడమిక్ రిజిస్టర్‌లో నమోదు చేసిన సూచనలు, సమస్యలు మరియు నిర్దేశించిన చర్యలు తదుపరి సందర్శన సమయంలో అమలు అయ్యాయా లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా సమీక్షించాలని సూచించారు. గత సందర్శనలో సూచించిన అంశాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తీసుకున్న చర్యలను పరిశీలించి, పెండింగ్ అంశాలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలపై ప్రతిరోజూ ప్రగతిని సమీక్షిస్తూ, పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Telangana
విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
Quick Summary:
జిల్లాలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను