నేటిసాక్షి, మిర్యాలగూడ :
పట్టణంలోని
శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో, చదువుతున్న విద్యార్థుల కోసం రోటరీ క్లబ్ వారి సహకారం చాలా గొప్పదని, పాఠశాల కోసం 50 బెంచిలతో పాటు తో పాటు, లక్ష 50 వేల విలువగల ఆట వస్తువులను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో రోటరీ క్లబ్ సహకారంతో అందించిన ఆట వస్తువులను రోటరీ క్లబ్ అధ్యక్షుడు మా శెట్టి శ్రీనివాస్ తో కలిసి, పాఠశాల ప్రబంధ కారిణి అధ్యక్షుడు గౌరు దయాకర్ కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దాతలు ఇచ్చిన సహకారంతో విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు సామాజిక అవగాహనను పెంపొందించే శ్రీ సరస్వతీ శిశు మందిరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజకీయాలకతీతంగా పాఠశాల అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చిలుకూరు బాలు, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్, ఇమ్రాన్, కౌన్సిలర్లు ఇంద్ర కుమార్, రోటరీ క్లబ్ సభ్యులు విశ్వనాథ్, సిమ్రాన్ మైనీ, అశోక్ కుమార్, మాశెట్టి వీరయ్య, రేపాల అంతయ్య, సుదర్శన్ తో పాటు ఇన్నర్ వీల్ సభ్యులు మాశెట్టి భాగ్యలక్ష్మి, రేపాల వాసవి, గౌరు సీత, శ్రీ సరస్వతి శిశు మందిర్ సభ్యులు మురహరి, అనంతరెడ్డి, యామిని వెంకటేశ్వర్లు, గూడూరు శ్రీనివాసరావు, బండారు ప్రసాద్, తిప్పన వెంకటేశ్వర్ రెడ్డి, రంగారావు, జగన్ శర్మ, తోపాటు హెడ్మాస్టర్ చెన్నూరు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
విద్యార్థుల కోసం... రోటరీ క్లబ్ చేయూత అభినందనీయం -శ్రీ సరస్వతి శిశు మందిర్ కు లక్షా 50 వేల విలువగల ఆట సామాగ్రి అందజేత -అభినందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Quick Summary:
అభినందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
