నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
............................................
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ఆదుకోసం ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు" కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల రైతుల పక్షాన మాట్లాడారు. వ్యవసాయం, సన్న వడ్ల సాగుపై సూచనలు, సలహాలు తెలిపారు.
అనంతరం రైతులకు 100% సబ్సిడీపై కంది చిరు సంచులు, నాణ్యమైన విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
*ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ*
"రైతులు సన్న వడ్ల సాగు వైపు అడుగులు వేయండని సూచించారు.సన్న వడ్లకు మార్కెట్ లో మంచి ధర వస్తుందన్నారు.ప్రభుత్వం ఇస్తున్న 100% సబ్సిడీ విత్తనాలు, కంది చిరు సంచులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వరావు నేతృత్వంలో రైతు సంక్షేమే మా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో
ఆత్మా చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ లు గోడిసెల గంగాధర్, సంగేపు మహేష్, సైంటిస్ట్ విజయ్ భాస్కర్, మాజీ మార్కెట్ చైర్మెన్ నక్కల రవీందర్ రెడ్డి, ఏడిఏ తిరుపతి నాయక్, ఏఓ వినీల, ఏఈఓ నాగరాజు, మంజుల, మాజీ ఎంపిటిసి రాజశేఖర్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
Telangana
*రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది* *రైతులు సన్న వరి సాగు చేయండి* *అంబారిపేటలో రైతు ముంగిట విత్తనాల పంపిణీ* *జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్* -------------------------------------------
Quick Summary:
*రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది*