నేటి సాక్షి ఆగస్టు 04 పాములపాడు:-
పాములపాడు మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగరవేసి, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. బిజెపి కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు మండల కేంద్రమైన పాములపాడు లో బిజెపి కార్యాలయంలో మండల పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి, సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలో బిజెపిని బలోపేతం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఆసక్తి ఉన్న యువతను బీజేపీ పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ
"సర్" ప్రోగ్రాం లో మనం క్రియాశీలకంగా పాల్గొనాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బిజెపి కేంద్ర, రాష్ట్ర పిలుపుమేరకు ఇప్పటి నుంచే సర్వం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మండలంలోని బిజెపి కార్యకర్తలకు అన్ని విషయాల్లో పార్టీ అండగా ఉంటుందని, పార్టీ కార్యకర్తల వికాసం కోసం బిజెపి ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. మండల పదాధికారులు ప్రజలతో మమేకమై పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, మండలంలోని ప్రజా సమస్యలు, సమీప గ్రామాలలోని సమస్యలు పార్టీ, అధికారుల దృష్టికి తీసుకువెళుతూ పరిష్కార మార్గం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పదాధికారులు ప్రవీణ్ కుమార్, గోపాలకృష్ణయ్య, రమేష్ ఆచారి, వెంకటేశ్వర్లు, మల్లికార్జున,వెంకటరమణ, చంద్ర శేఖర్ రెడ్డి, సూర్యం, ఆరోగ్య స్వామి, అబ్రహం, లాజరేష్, ఏసన్న, చిలుక రాజు, మహేష్, నాగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Andhra
ప్రతి గ్రామంలో "బిజెపి"ని బలోపేతం చేస్తాం: బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ - స్థానిక ఎన్నికలలో ప్రతి స్థానంలో పోటీ చేస్తాం
Quick Summary:
స్థానిక ఎన్నికలలో ప్రతి స్థానంలో పోటీ చేస్తాం
