నేటిసాక్షి, మిర్యాలగూడ : దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండమల్లేపల్లిలో నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ, శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో ట్రస్మా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కల్లు రూపారెడ్డి హత్య అత్యంత హేయమైన చర్య అని విద్యాబుద్ధులు నేర్పే ఒక ప్రిన్సిపాల్ ను ఘో రంగా హత్య చేయడం క్షమించరాని నేరమని, ఉపాధ్యాయుల స్వేచ్ఛ భద్రతకు రక్షణ కల్పించాలని యాజమాన్యాలు ఉపాధ్యాయులపై దాడులను నివారించి, విద్య భలోపేతానికి తల్లిదండ్రులని బాధ్యత వహించేలా చూడాలని, పాఠశాల పరిసర ప్రాంతాలలో మద్యం ఇతర దుకాణాలను లేకుండా చేసి షీ టీమ్స్ ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులకు గౌరవం పెంచే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని
అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యాలు శ్రీరామ కవచం నాగరాజు, నిరంజన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, జయరాజన్, అయ్యన్న, శ్రీపతి శ్రీనివాస్, మహమూద్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస చారి, వరప్రసాద్, సోమయ్య మధుసూదన్ శ్యాంసుందర్, రియాజ్ శ్రీధర్ రెడ్డి, నీలిమ చంద్రకళ, నర్సిరెడ్డి, వివిధ పాఠశాలల ప్రైవేటు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
రూపారెడ్డి హత్యకు నిరసనగా...మిర్యాలగూడలో భారీ ర్యాలీ
Quick Summary:
దేవరకొండ నియోజకవర్గ
