నేటి సాక్షి తొగుట... వడ్డే నరసింహులు
తొగుట మండల కేంద్రంలోని కేజీబీవీ లో కలెక్టర్ మరియు DCPO ఆదేశాల మేరకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికిముఖ్య అతిథిగా పాల్గొన్న తొగుట ఎస్సై నవీన్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
బాల్య వివాహాలు చేసినా, సహకరించినా, చేసుకున్న వారికి బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం శిక్షార్హులు అవుతారని బాలల బంగారు భవిష్యత్తును చిదిమేసి చిన్నతనంలోనే పెళ్లి చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అన్నారు.
బాలబాలికలు బాగా కష్టపడి చదువుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జీవితంలో సెట్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనే సంకల్పంతో చదువును సాగించాలని అనవసరపు విషయాల పట్ల ఆకర్షితులు కాకుండా చదువు పైనే దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు
నేటి పరిస్థితులలో బాల బాలికలు సోషల్ మీడియా, ఇంస్టాగ్రామ్ , ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల ద్వారా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారని వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వం చాలా అవకాశాలు కల్పిస్తుందని చదువుకునే విద్యార్థులకు స్కూళ్లు, హాస్టళ్ళు, కాలేజీలలో మార్నింగ్ అల్పారం మధ్యాహ్న భోజనం లాంటి అనేక సదుపాయాలుకల్పిస్తున్న తరుణంలో విద్యార్థులు బాగా చదువుకుని ఎదగాలని తల్లిదండ్రుల నమ్మకాలను వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉద్యోగం పొందాలని జీవితంలో చదువు అనే ఆయుధం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే చదువు ప్రధానమైనదని తెలియజేశారు.
ఆశ్రిత సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ గణేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దుకోవడం మనందరి బాధ్యత అని బాలబాలికల భవిష్యత్తుకు మనందరం భరోసనివ్వాలని ఎక్కడైనా బాల్యవివాహాలు జరుపబోతున్నారని తెలిస్తే
చైల్డ్ హెల్ప్ లైన్ 1098 , లేదా 112 , 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరని వారికి కౌన్సిలింగ్ చేసి వాటి వల్ల నష్టాలు అర్థమయ్యేలా వివరిస్తారని తెలియజేశారు. అనంతరం SI నవీన్ గారిచే బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 వాల్ పోస్టర్ ను, ఆవిష్కరించడం జరిగింది.
కార్యక్రమం లో తొగుట కేజీబీవీ S.O భాగ్యలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ ఉమ, ఆశ్రిత కమ్యూనిటీ సోషల్ వర్కర్ మౌనిక, మరియు ఉపాధ్యాయ బృందం,పాల్గొన్నారు.
Telangana
బాల్యవివాహం చేయొద్దు బాలల భవిష్యత్తును తుంచొద్దు
Quick Summary:
తొగుట మండల కేంద్రంలోని కేజీబీవీ