*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 - జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధికారులతో పర్యటించిన అనంతరం వార్డ్ కార్యాలయంలొ నిర్వహించిన సమావేశంలో.....భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లలోకి చేరుతుందని, అర్ధరాత్రి వేళలో లో ప్రెజర్ తో త్రాగునీటిని సరఫరా చేయడం వల్ల త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అదేవిధంగా తమ జీవనోపాధి కోసం డబ్బాలను ఏర్పాటు చేసుకొని చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటే అధికారులు డబ్బాలను తొలగించాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారని రాజీవ్ గృహకల్ప వాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్బంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ మాట్లాడుతూ....
రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉండేది అధికంగా పేదలేనని, జీవనోపాధి కోసం కూలి పనికోసం, ఉద్యోగాలకు కోసం నగరానికి వెళ్లి వచ్చే ప్రైవేటు ఉద్యోగులు అర్ధరాత్రి వేళల్లో లో ప్రెజర్ తో నీటిని సరఫరా చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు చేసి అర్ధరాత్రి వేళల్లో కాకుండా సాయంత్రం వేళల్లో నీటిని విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలను, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, రాజీవ్ గృహకల్ప సముదాయం సంక్షేమ సంఘాల సభ్యులు, గృహకల్ప వాసులు, స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కల్పించాలి* *-బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్*
Quick Summary:
వీధి వ్యాపారులకు ప్రత్యునయం ఏర్పాటు...