నేటి సాక్షి గజ్వేల్:--- గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో వర్షపు నీరు ఇళ్ల మధ్యలో భారీగా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తోంది.
నీరు రాకపోకల మార్గంలో నిలిచిపోవడంతో కాలనీ ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే భవిష్యత్తులో వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ, నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు మహమ్మద్ గౌసొద్దీన్, ఇక్బాల్, నరసింహారెడ్డి, జనార్ధన్ రెడ్డి, దమ్మని మల్లేశం, సతీష్ కుమార్ తదితరులు విజ్ఞప్తి చేశారు.
Telangana
ఇళ్ల మధ్యలో నిలిచిన వర్షపు నీరు.. చెరువును తలపిస్తున్న దృశ్యం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు – సమస్య పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి
Quick Summary:
ప్రజలకు తీవ్ర ఇబ్బందులు – సమస్య పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి