నేటి సాక్షి ఆగస్టు 0 3 జూపాడుబంగ్లా :-
నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా జూపాడుబంగ్లా మండలం బన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్య అధికారి డాక్టర్. గంగాధర్ మరియు డాక్టర్ సభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామింగ్ లో బాగంగా క్షయ యూనిట్ బృందం రావడం జరిగినది.
*టీబీ* *సూపర్వైజర్* *చక్రపాణి* *మరియు* *హెల్త్* *సూపర్వైజర్* *రాముడు *ప్రజలకు* *అవగాహన* *కల్పిస్తూ* *మాట్లాడుతూ*
మన ప్రధాన మంత్రి టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమం లో బాగంగా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమైనది. భారత దేశంలో క్షయ వ్యాధి నీ అంతం చేయడానికి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు క్షయ వ్యాధిని మరియు మరణాలను వెంట వెంటనే వేగంగా తగ్గించడమే టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా టీబీ నీ తరిమికొట్టాలి దైర్యంగా ఉండాలి అధైర్య పడనవసరం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
జూపాడుబంగ్లా బన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో బన్నూరు సబ్ సెంటర్ లోసచివాలయం లో టీబీ ముక్త్ భారత్ క్యాంప్ మరియు ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు బిపి, షుగర్, టిబి, ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధి లక్షణాలు రెండు వారాల నుంచి దగ్గు జ్వరం ఆకలి మందలించడం బరువు తగ్గటం రాత్రిళ్ళు చెమటలు పట్టడం తగ్గినప్పుడు తెమడలో రక్తం పడటం వంటి ఉన్నట్లయితే దగ్గర్లోని హాస్పిటల్ కి వెళ్లి తెమడ పరీక్ష ఎక్స్రే పరీక్ష ద్వారా టీవీ నిర్ధారణ అయితే ఆరు నెలల క్రమం తప్పకుండా మందులు వాడితే క్షేవ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని టీబీ సూపర్వైజర్ చక్రపాణి వారు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.మరియు క్షయ వ్యాధిగ్రస్తుడు మందులు వాడుతున్న అంతకాలం పోషణ భత్యం నిమిత్తం నిక్షయ పోషణ యోజన పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. క్షయ వ్యాధి అనుమానితుల వారి వద్ద నుండి కెమెరా శాంపుల్స్ సేకరించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో అనుసంధానం కలిగిన ఎక్స్రే పరీక్షలు చేయడం జరిగినది. సుమారుగా 100 మందికి టీబీ ఎక్స్రే పరీక్షలు చేయడమైనది అత్యంత ఆధునికకరమైనటువంటి హ్యాండ్ ఓల్డ్ ఎక్స్రే ద్వారా ఛాతి ఎక్స్రే పరీక్ష నిర్వహించడం జరిగింది. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని వారు తెలిపారు.
*హెల్త్* *సూపర్వైజర్* *విజయలక్ష్మి* *మాట్లాడుతూ* ..
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మలేరియా డెంగ్యూ, వ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలను అవగాహన కల్పించారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి ముందస్తు రోగ నిర్ధారణ నాణ్యమైన చికిత్స మరియు సంరక్షణ అందుబాటులో ఉండే క్షయ రహిత లక్యంగా ఉండాలన్నదే మన భారతదేశం అని తెలిపారు అంతేకాకుండా క్షయ వ్యాధిని ముందస్తుగా నే గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. టీబీ రహిత భారతదేశం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమం లో టీబీ ల్యాబ్ సూపర్వైజర్ ఉపేంద్ర యాదవ్ వారు పాల్గొని వచ్చిన ప్రజలందరికీ కూడా వారికందరికీ ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో బన్నూరు హెల్త్ సచివాలయం హెల్త్ సెక్రటరీ మందపోగు రాములమ్మ, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎమ్ ఎల్ హెచ్ పి లు రాజ్ కుమార్ , మరియు మందపోగు రాములమ్మ, రసూలబీ , ధాన రత్నమ్మ, అలివేలమ్మ, సునీత, మౌలలమ్మ,వైద్య సిబ్బంది సచివాలయం మహిళా కానిస్టేబుల్, డిజిటల్ అసిస్టెంట్ హరిత, శ్రీను వెల్ఫేర్ అసిస్టెంట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Andhra
బన్నూరు గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఛాతీ ఎక్స్రే స్క్రీనింగ్ శిబిరం:- టీబీ సూపర్వైజర్ చక్రపాణి. అవగాహన తోనే క్షయ వ్యాధి నిర్మూలన:- రాముడు హెల్త్ సూపర్వైజర్ టీబీ నీ (క్షయ) వ్యాధి నీ తరిమికొడదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం :- హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి.
Quick Summary:
టీబీ నీ (క్షయ) వ్యాధి నీ తరిమికొడదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం :- హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి.
