_
నేటి సాక్షి న్యూస్ జూన్ 16
పెద్దకడబూరు రైతులకు సకాలంలో సమృద్ధిగా సాగునీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్రరెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్. రమాకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలోని రాయల చెరువు వద్ద గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, జలహారతి నిర్వహించి పంటల సాగు కోసం నీటిని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాలువలు, చెరువులు, నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సాగునీటి లభ్యత పెరగడం ద్వారా రైతుల దిగుబడులు పెరిగి ఆర్థికంగా మరింత బలపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గవిగట్టు మల్లికార్జున, మంత్రాలయం మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు, డీసీ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Andhra
హెడ్లైన్ : రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
Quick Summary:
రైతులకు సాగునీరు అందించడమే

