నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఆగస్టు 4
వర్షాభావ పరిస్థితులు మరియు సాగునీరు అందక ఎండుతున్న పంటలను పరిశీలించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు మండలాల్లో పర్యటిస్తూ రైతులకు అవసరమైన సలహాలు, తగు జాగ్రత్తలు అందిస్తున్నారు.శాస్త్రవేత్తల పరిశీలనలు మరియు సూచనలుపంటల పరిశీలన: క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి తడులు లేక ఎండిపోతున్న వరి, మొక్కజొన్న, అపరాలు మరియు ఇతర ఉద్యాన పంటలను పరిశీలిస్తున్నారు.చౌడేపల్లి మండలంలోని కొండా మరి, వెంగళపల్లి, దిగువపల్లి గ్రామాలలో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన
కృషి విజ్ఞాన కేంద్రం ,కలికిరి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ కే మంజుల ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన స్థానం పెరమాళ్ళపల్లి శాస్త్రవేత్తలు ,కే వి కె ,మరియు అగ్రి పాలిటెక్నిక్ కలికిరి శాస్త్రవేత్తలు చౌడేపల్లి మండలంలొ వివిధ గ్రామ పంచాయతీల్లో ఎల్ ని నో ప్రభావం వల్ల దెబ్బతింటున్న వివిధ పంటలను పరిశీలించారు.ఆవులకు పెంచుకునే సూపర్ నేపియర్, జొన్న లాంటి పశుగ్రాస పంటలు కూడా బోర్ల కింద నీరు తగ్గిపోవడంతో వాడి ఎండిపోతున్నాయి అని తెలిపారు. ఆగస్టు - సెప్టెంబర్ మాసాలలో వర్షం వచ్చినప్పుడు కంది, అలసంద, అనుమలు, ఉలవ, పెసర ,మినుము, కొర్ర, జొన్న ,సజ్జ ,ఆముదం మొదలగు పంటలను సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు . పంట నుంచి వచ్చే వ్యర్ధాలను, ఎండి రాలే ఆకులను, చిరుకొమ్మలను మొదలగు వాటిని కొద్దిపాటి విస్తీర్ణంలో పెంచుకుంటున్న కూరగాయలు, పండ్ల తోటలలో, మరియు పూల తోటలలో ఆచ్చాదనంగా (మల్చింగ్) వేసుకోవాలని ,తద్వారా నీటి తడను తగ్గించుకోవచ్చని ,ఈ పదార్థమే కుళ్ళి ఎరువుగా ఉపయోగపడుతుందని తెలిపారు. వీలైన వారు పొలాల దగ్గర వర్షపు నీరు నిలువ ఉండగల గుంతలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. రైతులు పంట భీమా తప్పనిసరిగా చేయించుకోవాలి అని పర్యటన బృందం తెలియచేసింది. ఈ పొలాల సంధర్శనలో పెరుమాళ్ళపల్లి రీసెర్చ్ స్టేషన్ హెడ్ డాక్టర్.ఎమ్.రెడ్డి కుమార్ , సైంటిస్ట్ డాక్టర్ కె ఆర్ ఠాగోర్, మండల వ్యవసాయ అధికారి మోహన్ సబ్జెక్టు మాటర్ స్పెషలిస్ట్ ఎస్. సోమశేఖర బాబు మరియు అగ్రి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ టీచర్ జ్యోత్స్న మరియు అగ్రి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యార్థినులు మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Andhra
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి పంటల సాగుపై శాస్త్రవేత్తల సూచనలు | ఊటుకూరు కృషివిజ్ఞాన .
Quick Summary:
పంటల సాగుపై శాస్త్రవేత్తల సూచనలు | ఊటుకూరు కృషివిజ్ఞాన .