నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
......................................
స్థానిక తాటిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒక్కరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ మూలా గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని లీడ్ ఇండియా స్టేట్ ట్రైనింగ్ మేనేజర్ తాడూరి శ్రీనివాస్ ఆచార్య పర్యవేక్షించారు.
*ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ*
విద్యార్థులకు జీవిత లక్ష్యం, మానసిక అభివృద్ధి, మానవతా విలువలు, చదవడం - రాయడంలో మెళకువలు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధానం, జీవిత నైపుణ్యాలు, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవ మర్యాదలు తదితర అంశాలపై విలువైన సూచనలు చేశారు.
అనంతరం ఎంఈఓ గంగాధర్ మాట్లాడుతూ.. ఇలాంటి శిక్షణతో పిల్లల్లో విద్యా నైపుణ్యాలతో పాటు మానవతా విలువలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత తల్లిదండ్రులకు పాదపూజ చేయించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, లతీఫ్, గంగారం, శ్రీకాంత్, సవిత, సునీత, దేవి తదితరులు పాల్గొన్నారు.
Telangana
**శిక్షణతో పిల్లల్లో విద్యాప్రమాణాలు పెరుగుతాయి* *ఎం ఈ ఓ గంగాధర్* *తాటిపల్లి హైస్కూల్లో లీడ్ ఇండియా ఫౌండేషన్ శిక్షణ* ---------------------------------------
Quick Summary:
తాటిపల్లి హైస్కూల్లో లీడ్ ఇండియా ఫౌండేషన్ శిక్షణ* ---------------------------------