నేటి సాక్షి ఆగస్టు 06
మంత్రాలయం మండలం సౌలహళ్లి గ్రామంలోని 50 మంది దళితులకు కేటాయించిన ఇంటి స్థలాల పట్టాల అంశంపై పెద్దకడబూరు మండల టీడీపీ నాయకుడు బొగ్గుల తిక్కన్న గత 11 సంవత్సరాలుగా అసత్య ప్రచారం చేస్తూ పట్టాదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని జై భీమ్ ఎమ్మార్పీఎస్ పెద్దకడబూరు మండల అధ్యక్షుడు మంచోది ఆదాము మాదిగ ఆరోపించారు. గురువారం పెద్దకడబూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సౌలహళ్లి గ్రామ సర్వే నంబర్ 19/B1Aలోని 2.89 ఎకరాల భూమిని ప్రభుత్వం 1999లో 50 మంది దళిత కుటుంబాలకు ఇంటి స్థలాలుగా పట్టాలు మంజూరు చేసిందని, ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వ రికార్డులు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. అయితే కొందరు ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించి పట్టాదారులు ఇళ్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించిందని చెప్పారు. అయినప్పటికీ అధికార పార్టీ అండతో మంత్రాలయం తహసీల్దార్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఆక్రమణదారులకు అనుకూలంగా ఉత్తర్వులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ దళితుల హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నారని, ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హైకోర్టు తీర్పు, అధికారుల నిర్ణయం వెలువడే వరకు రాజకీయ విమర్శలు చేయకుండా వేచి చూడాలని బొగ్గుల తిక్కన్నకు సూచించారు. సౌలహళ్లి గ్రామంలోని 50 మంది దళిత పట్టాదారులకు న్యాయం జరిగే వరకు జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆదాము మాదిగ స్పష్టం చేశారు. సమావేశంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
సౌలహళ్లి దళితుల పట్టాలపై అసత్య ప్రచారం మానుకోవాలి _ 50 మంది పట్టాదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం: జై భీమ్ ఎమ్మార్పీఎస్
Quick Summary:
మంత్రాలయం మండలం సౌలహళ్లి