నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం కృష్ణారావుపేట గ్రామం లో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త. జయసూర్య.
తుమ్మలూరు ప్రెసిడెంట్ ప్రసాద్ ఎమ్మెల్యే వారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత ఎంపిడిఓ చంద్రశేఖర్ శాలువాలతో సన్మానం చేయడమైనది.
ఎమ్మెల్యే గిత్త. జయసూర్య వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లినప్పుడు వృద్ధాప్యంలో వితంతువులకు అందరికీ 3000 పెన్షన్ ఉన్న లబ్ధిదారులకు ఒకేసారి 4000 వేలు పెంచడం ద్వారా ప్రతి లబ్ధిదారుడు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారూ. అలాగే ఒకే కుటుంబంలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమంది పిల్లలకుతల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి. అని చాలా ఆనందాన్ని లబ్ది దారులు తెలియజేస్తున్నారు. కృష్ణారావు పేటకు చెందిన నూరుళ్ల కుటుంబానికి అల్లబకాష్ వీరి కుటుంబానికి ఉమ్మడి అన్నదమ్ముల కుటుంబం మొత్తం వీరికి మొత్తం ఒకేసారి 7 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయని ఆయన నూరుళ్ల లబ్ది దారుడు మాటల్లో తెలియపరిచారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాగునీటి, సీసీ రోడ్లు కానీ ఎల్ఈడి బల్బ్స్ గాని , గ్రామంలో మౌలిక వసతులకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా యువ నాయకుడు నారా లోకేష్ బాబు వారి కృషి వలన అందరికి అందుబాటులో మన అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం అన్ని వేళల కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలియపరిచారు. ఈ కార్యక్రమం లో మండల టీడీపీ నాయకులు మండల ఎస్ఐ పి.తిరుపాలు వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాములపాడు ఎంపీడీవో ఎం చంద్రశేఖర్ , డిప్యూటీ ఎంపీడీవో తిరుపాలు, తహసిల్దార్, జీ సుభద్రమ్మ, ఈ ఓ ఆర్ డి సులోచన కూటమి నాయకులు సీనియర్ నాయకులు వెంకటేశ్వరయాదవ్, టీడీపీ మండల నాయకులు రవీంద్ర రెడ్డి , సురేష్ , తెలుగు యువత నాయకులు కరీం భాష, సహకార సంఘం చైర్మన్ రాయపాటి గోవిందు , టీడీపీ సీనియర్ నాయకులుమిట్టకందాల మాజీ సర్పంచ్ హరి ప్రసాద్ యాదవ్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మెంబర్ లింగాల నాగరాజు టీడీపీ నాయకులు మద్దూరు తిమ్మరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.
Andhra
ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అంటే అది కూటమి ప్రభుత్వం లక్ష్యం :- ఎమ్మెల్యే. గిత్త. జయసూర్య.
Quick Summary:
పాములపాడు మండలం కృష్ణారావుపేట
