Telangana
వేములపల్లిలో తక్షణమే ఫ్లైఓవర్ నిర్మించి, ప్రజల ప్రాణాలను కాపాడండి సార్..... -బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం
Quick Summary:
బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు
నేటిసాక్షి, నల్లగొండ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండల కేంద్రం మీదుగా వెళ్లే NH-167 నార్కట్‌పల్లి–అద్దంకి జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే వేములపల్లి గ్రామంలో ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతూ, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిఎస్పీ నాయకులు మాట్లాడుతూ, వేములపల్లి వద్ద రహదారి దాటే సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ రద్దీతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వేములపల్లి మండల కేంద్రంలో తక్షణమే ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రావులపాటి రవిశంకర్, పార్లమెంట్ ఇంచార్జి పంటపాక యాదగిరి, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి కత్తుల కాన్షీరామ్, బొడ్డు కిరణ్, భాషపాక శివ, మధు యాదవ్, పుట్ట దినేష్, గాలిబు, తగరం సుభాష్ చంద్రబోస్, వంటపాక కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.