నేటి సాక్షి పాములపాడు(ఆగస్ట-24):-
మండల కేంద్రమైన పాములపాడులోని, జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ మరియు మండల తహసీల్దార్ కార్యాలయం సోమవారం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ, తదితర అధికారులతో కలిసి శుక్రవారం నిర్వహించే పిజిఆర్ఎస్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ లు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ గ్రీవెన్స్ శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గంలోని, కొత్తపల్లి, పాములపాడు మండలాలకు చెందిన చెందిన గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలు అనేక సమస్యల కోసం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కు వెళ్లకుండా నియోజకవర్గంలోనీ, పాములపాడు ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కు నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షోరాన్ రానున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ జిల్లా కలెక్టర్ పాల్గొనే ప్రత్యేక గ్రీవెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివ, మండల తహసీల్దార్ జి.సుభద్రమ్మ, ఇంచార్జి ఎంపీడీఓ సులోచన, ఎంఈఓ బాలాజీ నాయక్, హైస్కూల్ హెచ్ఎం ఎన్. శ్రీధర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు జి.రవీంద్ర రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు చెల్లె హరినాథ్ రెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ పలచాని మహేశ్వరరెడ్డి, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడల జనార్దన్ రెడ్డి, మండల తెలుగు కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, రుద్రవరం నాయకుడు రాచపూడి సురేష్, తెలుగు యువత మండల అధ్యక్షులు షేక్.కరీంబాషా, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ- రవీంద్ర, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Andhra
*ఈనెల 28న పాములపాడులో జరిగే జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య*
Quick Summary:
మండల కేంద్రమైన పాములపాడులోని
