*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాసు శంకర్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ విచారం వ్యక్తం చేశారు.
శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మగ్దూంనగర్ లోని నివాసంలో ఆయన పార్దివదేహంపై పుష్పగుచ్చం వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అతని కుటుంబానికి మనోధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీలో ఎంతో చురుకుగా పనిచేయడంతో పాటు అందరితో కలపుగోలుగా ఉండే శంకర్ మృతిచెందడం పార్టీకి తీరని లోటని ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గుబురు గుట్టలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
Telangana
*మాదాసు శంకర్ మృతి చాలా బాధాకరం* *-మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్*
Quick Summary:
*మాదాసు శంకర్ మృతి