నేటి సాక్షి నారాయణపేట జూన్ 23( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),
నారాయణపేట జిల్లాలోని మరికల్, ధన్వాడ కేంద్రాలలోని
రైతు వేదికలో విత్తన మేళా నిర్వహణ కార్యక్రమాన్ని
మరికల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాల అందుబాటు కల్పించే లక్ష్యంతో విత్తన మేళాను నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు ఎల్‌నినో ప్రభావం, ఖరీఫ్ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన కంది రకాలు, బోనస్‌కు అనుకూలమైన వరి రకాలపై అవగాహన కల్పించారు.
మేళాలో రైతులకు అందుబాటులో ఉన్న వరి రకాలైన బీపీటీ -5204, ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కెఎన్‌ఎమ్-1638,-44, కెఎన్‌ఎమ్-7715 మరియు మరో నూతన వరి రకం గురించి వివరించారు. అదేవిధంగా కంది, పెసర తదితర పంటల నూతన వంగడాలను కూడా రైతులకు పరిచయం చేశారు.
రైతులకు ఉపయోగపడే నానో యూరియా, నానో డీఏపీ, నూతన కూరగాయల వంగడాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. గ్రోమోర్, సంకల్ప్ ఆగ్రోస్, జై కిసాన్, సుగురేశ్వర ఫర్టిలైజర్స్ తదితర వ్యవసాయ సంస్థలు తమ స్టాల్స్ ద్వారా రైతులకు సాంకేతిక సలహాలు మరియు ఉత్పత్తుల వివరాలను అందించాయి.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నవీన్ కుమార్, రెహమాన్,మరికల్ సర్పంచ్ గుప చెన్నయ్య, సూర్యమోహన్, హర్షవర్ధన్ , వ్యవసాయ అధికారి రెహమాన్, వ్యవసాయ విస్తరణాధికారి పరుశురాం పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విత్తనాలు, ఆధునిక సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం మరియు నూతన పంట రకాలపై అవగాహన పొందారు. సహా పలువురు రైతులు పాల్గొన్నారు.
Telangana
రైతు వేదికలో విత్తనం మే మేళ..... మరికల్ ,ధన్వాడలో,
Quick Summary:
రైతు వేదికలో విత్తనం మే మేళ.....
