నేటి సాక్షి ఆగస్టు 12
పెద్దకడబూరు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడిగా పెద్దకడబూరుకు చెందిన మేతారి సదానందం నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి పోరాడతానని సదానందం తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజా సమస్యలపై పార్టీ తరఫున మరింత చురుకుగా పోరాటాలు నిర్వహిస్తామని సదానందం తెలిపారు.
Andhra
కర్నూలు డీసీసీ ఉపాధ్యక్షుడిగా పెద్దకడబూరు సదానందం _ ప్రజా, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సదానందం
Quick Summary:
పెద్దకడబూరు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడిగా