నేటి సాక్షి 12ఆగస్టు కొత్తపల్లె :---
నందికొట్కూరు నియోజకవర్గంలో ఆత్మకూరు తాలూకా కొత్తపల్లె తహసిల్దార్ ఆఫీస్ లో డిప్యూటీ తహశీల్దార్ గా అరుణ భూపాల్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో ఒకరికి స్వచ్ఛందంగా సహాయం చేయాలి అనే ఆలోచన చాల మందిలో ఒకరికి ఉంటుంది. ఆ ఒక్కరే అరుణ భూపాల్.. నందికొట్కూరు నియోజవర్గంలో ఎక్కడ రోడ్ల పైన అనాధలు కనిపించిన వెంటనే చలించిపోయి, రోడ్లపైన పడుకొని ఉన్నవారి దగ్గరకు వెళ్ళి దుప్పట్లు పంచుతారు. ఎక్కడైతే అనాథలుగా కనిపిస్తే చాలు వెళ్లి దుప్పట్లు పంచడం, పేద గుడిసెల్లో నివసిస్తుంటే అక్కడికి వెళ్లి దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉంటుంది .ప్రతి సంవత్సరం ఎక్కడ ఎక్కడ ఉద్యోగం చేసిన ఆమె సంవత్సరం మొదలు కొని డిసెంబర్ జనవరి లాస్ట్ వరకు కూడా ఇలాంటి వారు తనకూ పరిచయం లేకున్న ఆపదలో ఉన్నారు ఎవరు లేరు అంటే తన వంతు సహాయం చేద్దాం అనే కోణం లో ఎప్పుడూ ఆలోచిస్తుందని తెలిపారు.ప్రతి రోజు ఏదో ఒక సందర్భంగా అనాధలకు స్వచ్ఛందంగా దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతుంది. ఇలా 20 సంవత్సరాల నుండి ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనాధలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతుంది .మరియు ఎక్కడైతే మహిళలు దుస్తులు లేకుండా తిరుగుతారో అక్కడ ఆ మహిళా అనాధలకు చీరలు పంపిణీ కూడా చేస్తూ ఉంటుంది. కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన ఒక వికలాంగుడు నీ చూసి అరుణ భూపాల్ మేడం వారు చలించిపోయారు.కావున ఆయనకు ఎవరు లేరని తెలుసుకున్న డిప్యూటీ తాసిల్దార్ అరుణ భాయ్ ఇద్దరు కలిసి దోమతేరాలను మరియు బెడ్ షిట్ లను పంపిణీ చేశారు.కాబట్టి ఇలాంటి వారు దారి వెంటలో కనపడితే చాలు ఆమెకు తోచిన సహాయం చేయడం ఆమె ఒక నిజాయితీకి అద్దం పట్టినట్టు గా వ్యవహరిస్తారు.అంతేకాకుండా గతం లో కూడా చాలా సార్లు డ్యూటీ విషయంలో ఆత్మకూర్ సంగమేశ్వరం సర్కిల్ వద్ద తమిళనాడుకు చెందిన మహిళ డిప్యూటీ తాసిల్దార్ అరుణ వారికి కు కనబడడం అక్కడే ఆమె దుప్పట్లు పంపిణీ చేశారు. కాబట్టి ఈమె కు ఉన్న సేవా చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు ఒకరికి మనం చేతనైన సహాయం చేయాలని మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే మన తల్లీ తండ్రులు చూపిన ప్రేమ,దేవుడు ఆశీస్సులు దీవెనలు ఉండబట్టి ఇప్పుడు మనం ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.ఈ జీవితం నీటిలో బుడగ లాంటి ది కాబట్టి మనం ఉన్న కొద్ది రోజులు కలతలు కలహాలు విడనాడాలి.మనం ఒకరికొకరు ప్రశాంతంగా, కలిసి మెలసి జీవితాంతం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ నవుతూ మన చుట్టూ ఉండేవారికి సంతోషాన్ని వ్యక్తపరచాలి.ప్రతి ఒక్కరితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవాలి అనాథలుగా ఎవరు కాకూడదు.అన్ని ఉన్న కూడా కొంతమంది రోడ్ల పైన మనశ్శాంతి లేక, మానసికంగా తిరుగుతుంటారు.కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే తల్లి తండ్రులు ఉన్నపుడే బాగా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండటం వలన తల్లి తండ్రులు వారికి మా పిల్లలు బాగా చదివి ఒక ఉన్నత స్థాయిలోఉండటం వలన వాళ్లకు కలిగే సంతోషం చెప్పలేనిది.ఇల తల్లి తండ్రులనీ పిల్లలు రోడ్ల మీద అనాథలుగా ఒదిలేస్తున్నారు, అంటే దానికి కారణం ఎన్నో ఎన్నో కారణాలు ఉన్నాయి.కాబట్టి మనిషిని మనిషిగా చూడాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి సేవా చేయాలి.పెద్దలకు ఇల అనాథలుగా తిరుగుతున్న వారి పట్ల దయ, ప్రేమ జాలి అందరిలోనూ ఉండకపోవచ్చు కానీ మానసికంగా రోడ్లపైన తిరుగుతున్న వారిపై కూడా మానవత్వం తో ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని నా ముఖ్య ఉద్దేశం అని అరుణ భూపాల్ వారు తెలుపడం జరిగింది.ఈమె కొత్తపల్లె డిప్యూటీ తాసిల్దార్ అరుణ భూపాల్ కొత్తపల్లి , పిఎస్ అరుణ భాయ్ పంపిణీ చేశారు.
Andhra
పరిచయం లేని వ్యక్తి కి సహాయం చేయటం లో మన మనస్సు కి సంతోషం కలిగిస్తుంది. వీలైతే సాటి మనిషికి సహాయం చేద్దాం.. డిప్యూటీ తాసిల్దార్ అరుణ భూపాల్, అనాధలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న:-- డిప్యూటీ తాసిల్దార్ ,అరుణ భూపాల్* , *పిఎస్* *అరుణ* *భాయ్* ..
Quick Summary:
అనాధలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న:
